MDCL: కాప్రా మున్సిపల్ కార్యాలయం వద్ద గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి నివాళులర్పించారు. గాంధీ సత్యమార్గం ఎంచుకున్నారని, ఆయన జీవితం ఎంతోమందికి ఆదర్శంగా ఇప్పటికీ నిలుస్తున్నట్లుగా తెలిపారు. గాంధీజీ జయంతి వేడుకలలో అనేక మంది నేతలు, జీహెచ్ఎంసీ మున్సిపల్ అధికారులు పాల్గొని, ఉద్యమస్ఫూర్తిని గుర్తు చేసుకున్నారు.