కోనసీమ: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జ్ T.మల్లికార్జున రావు కుటుంబ సమేతంగా గురువారం ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి వారిని దర్శించారు. ముందుగా ఆలయ అర్చకులు, సిబ్బంది వారికి స్వాగతం పలికారు. స్వామి వారికి అభిషేకం, మాణిక్యంబ అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం వారికి ఆలయ మర్యాదలతో వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేసారు.