MNCL: గాంధీ ఆశయాలను కొనసాగిద్దామని జన్నారం మండల వర్తక సంఘం అధ్యక్షుడు వి.వామన్ అన్నారు. గురువారం మధ్యాహ్నం గాంధీ జయంతి సందర్భంగా జన్నారంమండల కేంద్రంలోని గాంధీ నగర్లో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ.. యువకులు గాంధీని ఆదర్శంగా తీసుకొని అతని అడుగుజాడల్లో నడవాలన్నారు. శాంతి మార్గాన్ని ఎంచుకొని విజయాలు సాధించాలన్నారు.