కోనసీమ: యూనిఫామ్ ధరించి నెత్తిన టోపీ పెట్టుకుని గన్తో కనిపించే పోలీసులు విజయదశమి సందర్భంగా ఆయుధాలు పట్టుకొని సందడి చేశారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆధ్వర్యంలో అమలాపురం కార్యాలయంలో ఆయుధ పూజ జరిగింది. ఈ పూజ అనంతరం ఎస్పీ మీనా కత్తి పట్టుకుని సందడి చేశారు. పోలీస్ ఆయుధాగారంలో పోలీసులు ఉపయోగించే ఆయుధాలకు, వాహనాలకు ఆయన పూజలు చేశారు