JGL: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎస్పీ అశోక్ కుమార్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్బీ ఇన్పెక్టర్ అరిఫ్ అలీ ఖాన్, ఆర్ఐలు కిరణ్ కుమార్, సైదులు, ఆర్ఎస్సైలు, సిబ్బంది పాల్గొని మహాత్ముని సేవా స్ఫూర్తిని స్మరించారు.