E.G: వైసీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (SEC) మెంబర్గా రాజమహేంద్రవరానికి చెందిన మేడపాటి షర్మిలారెడ్డి నియమితులయ్యారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి నియామక ఉత్తర్వులు అందినట్లు ఆమె తెలిపారు. ఇందులో భాగంగా ఆమె రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(రూడా) ఛైర్మన్గా పని చేశారు. షర్మిలా రెడ్డి నియామకం పట్ల పార్టీలో పలువురు హర్షం వ్యక్తం చేశారు.