KNR: ఇల్లందకుంటలోని శ్రీ సీతా రామచంద్ర స్వామి ఆలయానికి సంబంధించిన హుండీ లెక్కింపు శనివారం జరిగింది. దేవాదాయ శాఖ పరిశీలకులు సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన లెక్కింపులో రూ.8,59,961 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో సుధాకర్, ఛైర్మన్ రామారావు తెలిపారు. ఈ ఆదాయం 4 నెలల 14 రోజులకు సంబంధించినది. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.