RR: తలకొండపల్లి మండలం బల్సులపల్లి తండాకు చెందిన సెరికల్చర్ రైతులు శక్రు నాయక్, రమేష్ జిల్లా ఉత్తమ రైతులుగా ఎంపికయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో సెంట్రల్ సిల్క్ బోర్డ్ నిర్వహించిన ‘రేశం కృషి మేళా’ లో వారికి శుక్రవారం అవార్డులు అందజేశారు. తండాలో రిసోర్స్ సెంటర్ ఏర్పాటు చేసి పట్టు పరిశ్రమపై రైతులకు శిక్షణ ఇవ్వడం అభినందనీయమని జేడీ లత తెలిపారు.