ADB: నేరడిగొండ మండలంలోని బోరిగామా గ్రామంలో ఇల్లు కాలిపోయిన కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తానని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. బాధిత కుటుంబాలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావుతో మాట్లాడి కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా కల్పించారు.