WGL: రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 40-42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున మే 1 నుంచి 31 వరకు కేంద్రాలకు సెలవులు ప్రకటించారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉమ్మడి వరంగల్ జిల్లా అంగన్వాడి అధికారులు తెలిపారు.