BDK: దమ్మపేట రైతు వేదికలో సోమవారం 134 మంది టీచర్లకు మొబైల్ ఫోన్లను ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అందించారు. మహిళా శిశు సంక్షేమానికి అంగన్వాడి సేవలు ఎంతో కీలకమని, వారికి సాంకేతిక సదుపాయాలు అందించడం ద్వారా అంగన్వాడి టీచర్లు తమ విధులను మరింత సమర్థవంతంగా నిర్వహించగలరని తెలిపారు. డిజిటల్ సేవల వినియోగంతో లబ్ధిదారులకు వేగవంతమైన సేవలు అందుతాయని అన్నారు.