MNCL: అప్రమత్తతతోనే అగ్ని ప్రమాదాలను నివారించవచ్చని జన్నారం మండల ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ అన్నారు. వేసవి నేపథ్యంలో జన్నారంలోని వివిధ పాఠశాలల ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అగ్ని ప్రమాదాలు, వాటి నివారణపై అవగాహన కల్పించారు. ఇంటి పరిసరాలలో చెత్తాచెదారం, గడ్డివాములు ఉంటే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతాయన్నారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు సమాచారం ఇవ్వాలన్నారు.