NRPT: జిల్లాకు మంజూరైన నర్సింగ్ కళాశాలను సీఎం రేవంత్ రెడ్డి సోమవారం వర్చువల్‌గా ప్రారంభించారు. ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ హెచ్ఎండీఏ గ్రౌండ్స్‌లో జరిగిన ఆరోగ్య ఉత్సవాల కార్యక్రమంలో పాల్గొని, నర్సింగ్ కళాశాలను ప్రారంభించారు. నారాయణపేట మెడికల్ కళాశాలలో కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా అదనపు కలెక్టర్ బేన్ షాలమ్ వీక్షించారు.