JN: బీఆర్ఎస్ నాయకులు అసత్య ప్రచారాలు మానుకోవాలని కాంగ్రెస్ నాయకుడు గిరగాని కుమారస్వామి గౌడ్ అన్నారు. పాలకుర్తి కాంగ్రెస్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొని వారు మాట్లాడారు.10 ఏళ్లు అధికారంలో ఉండి కూడా ఎర్రబెల్లి పాలకుర్తిని అభివృద్ధి చేయలేదని, ఇప్పుడు కాంగ్రెస్ను విమర్శించే అర్హత ఎర్రబెల్లికి లేదని విమర్శించారు.