NRML: నిర్మల్ పట్టణంలో నిరుద్యోగుల కొరకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఉపాధి కల్పనా శాఖ అధికారులు తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో వచ్చే సోమవారం వివిధ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాల కల్పన కొరకు జాబ్ మేళా నిర్వహించనున్నారు. మొత్తం 124 ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఆసక్తి ఉన్న నిరుద్యోగులు తమ సర్టిఫికెట్లతో జాబ్ మేళాకు హాజరు కావాలని అధికారులు తెలిపారు.