»Brs Big Shock Former Mla Vemula Veeresham Resigns
Vemula Veeresham : బీఆర్ఎస్కు బిగ్ షాక్..మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశాం రాజీనామా
నకిరేకల్ టికెట్ ఇస్తారన్న ఆశతో ఉన్నా మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశానికి బీఆర్ఎస్ మొండిచేయి చూపడంతో నిరాశే మిగిలింది. దీంతో ఆ పార్టీకి ఆయన రాజీనామా చేశారు
నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Viresham) బీఆర్ఎస్ పార్టీకి రాజీనామ చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. నకిరేకల్ (Nakirekal) నుంచి చిరుమర్తి లింగయ్యకు టికెట్ కేటాయించడంతో వీరేశం బీఆర్ఎస్ గుడ్‌బై చెప్పారు.ఎన్నికల్లో నకిరేకల్ టికెట్ ఆశించిన వేముల వీరేశం.. టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలతో ఇవాళ ప్రత్యేక సమావేశం నిర్వహించిన వేముల.. ఈ సందర్భంగా బీఆర్ఎస్ (BRS) పార్టీకి రాజీమానా చేస్తున్నట్లు ప్రకటించారు. తనను, తన అనుచరులను కేసులతో ఇబ్బందులకు గురి చేశారని ఆయన ఆరోపించారు.
మరో పది రోజుల్లో కార్యకర్తలతో చర్చించి భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తానన్నారు. ఇప్పటికే ఆయన కాంగ్రెస్ (Congress) నాయకులతో చర్చలు జరిపారని.. మరికొన్ని రోజుల్లో వేముల హస్తం గూటికి చేరడం ఖాయమని రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన వేముల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.అభ్యర్థుల ప్రకటన(Declaration of candidates)తో అధికార బీఆర్ఎస్ పార్టీలో ప్రకంపనలు రేగుతున్నాయి. టికెట్ ఆశించి లిస్ట్‌లో పేరు లేని ఆశావాహులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టికెట్ దక్కకపోవడంతో కొందరు పక్కదారులు చూస్తున్నారు.. మరికొందరు పార్టీకి రాజీనామా చేస్తున్నారు. టికెట్ ఆశించి భంగపడ్డ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ (MLA Rekha Naik) ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తు చేసుకోగా.. తాజాగా మరో నేత బీఆర్ఎస్ నేత పార్టీకి రాజీనామా చేశారు.