»Bjp Is Leading In 2 States And Congress In 2 More States 5 States Election Results 2023
Election results 2023: 3 రాష్ట్రాల్లో బీజేపీ, మరో రాష్ట్రంలో కాంగ్రెస్ ఆధిక్యం
దేశవ్యాప్తంగా ఇటివల 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగగా..ప్రస్తుతం నాలుగు రాష్ట్రాల్లో ఓటింగ్ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఈ నాలుగు రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా గెలుపు అన్నట్లుగా ఆసక్తి ఉంది.
BJP is leading in 2 states and Congress in 2 more states 5 states election results 2023
ఈరోజు దేశవ్యాప్తంగా ఇటివల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను(election results 2023) ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో మిజోరంలో ఓట్ల లెక్కింపును ఎన్నికల సంఘం డిసెంబర్ 4కి రీషెడ్యూల్ చేయగా, మిగిలిన మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, తెలంగాణలలో ఎన్నికల ఫలితాలను అధికారులు ప్రకటిస్తున్నారు. ఈ సందర్భంగా 3 రాష్ట్రాలలో బీజేపీ ప్రధానంగా ముందంజలో ఉండగా..మరో రాష్ట్రంలో కాంగ్రెస్ లీడ్ కొనసాగుతుంది.
మధ్యప్రదేశ్లో బీజీపీ(BJP) 138 స్థానాల్లో ముందంజలో కొనసాగుతుండగా..కాంగ్రెస్(congress) పార్టీ 66 స్థానాల్లో లీడ్లో ఉన్నట్లు ఇప్పటివరకు ప్రకటించారు. ఇక రాజస్థాన్లో 92 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉండగా, 73 ప్రాంతాల్లో కాంగ్రేస్ లీడ్ కొనసాగుతుంది. ఇక ఛత్తీస్ గఢ్లో కూడా బీజేపీ 44 స్థానాల్లో ముందంజలోకి వచ్చింది. కాంగ్రెస్ 36 స్థానాల్లో లీడ్లో కొనసాగుతుంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీనే లీడ్లో కొనసాగుతుంది. 60కిపైగా స్థానాల్లో హస్తం పార్టీ హావా కొనసాగుతుండగా..బీఆర్ఎస్(BRS) పార్టీ 39 స్థానాల్లో రెండో స్థానంలో కొనసాగుతుంది. ఈ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు 2024లో లోక్సభ ఎన్నికలకు ముందు భవిష్యత్తు రాజకీయ వర్గాలను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
నాలుగు రాష్ట్రాల ఫలితాలను ఈరోజు ప్రకటిస్తున్నారు. మిజోరం తన 40 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 7న ఓటింగ్ నిర్వహించగా, ఛత్తీస్గఢ్లో నవంబర్ 7 నవంబర్ 30 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరిగాయి. మధ్యప్రదేశ్లోని 230 మంది సభ్యుల అసెంబ్లీకి నవంబర్ 17న పోలింగ్ జరిగింది. రాజస్థాన్ తన 199 స్థానాలకు నవంబర్ 25న ఓటింగ్ నిర్వహించింది. తెలంగాణలో నవంబర్ 30న 119 స్థానాలకు ఎన్నికలు జరిగాయి.