»Congress Is Leading In More Than 60 Seats In Telangana Election Results 2023
Telangana:లో 60కిపైగా స్థానాల్లో కాంగ్రెస్ ముందంజ
తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఎప్పుడూ లేనంతగా ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 60కిపైగా స్థానాల్లో లీడ్లో కొనసాగుతుంది. ఇక తర్వాత బీఆర్ఎస్ పార్టీ 40కిపైగా ప్రాంతాల్లో ముందంజలో ఉంది. ఇక ఆయా ప్రాంతాల్లో ఏ పార్టీ గెలుస్తుందో చూడాలి మరి.
Congress is leading in more than 60 seats in Telangana election results 2023
దేశవ్యాప్తంగా మరో మూడు రాష్ట్రాలతోపాటు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో మెజారిటీ కావాల్సిన 60 సీట్లకు గాను కాంగ్రెస్(congress) పార్టీ 64 ప్రాంతాల్లో ప్రస్తుతం ముందంజలో దూసుకెళ్తుంది. ఈ లీడ్ ప్రకారం ఆయా స్థానాల్లో గెలిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇప్పటి నుంచి సంబరాల్లో మునిగిపోయారు. మరోవైపు హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్ వద్ద స్పెషల్ బస్సులు ఏర్పాటు చేశారు. కార్యకర్తలు సహా కాంగ్రెస్ శ్రేణులకు పార్టీ ఇచ్చేందుకు ఈ బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. దీంతోపాటు పార్టీ కార్యాలయంలో లడ్డులు సైతం పంచేందుకు సిద్ధంగా ఉంచారు.
ఇక తెలంగాణలో అధికార బీఆర్ఎస్(BRS) పార్టీ రెండో స్థానంలో కొనసాగుతుంది. 40 స్థానాల్లో భారత రాష్ట్ర సమితి ప్రస్తుతానికి కొనసాగుతుండగా..భారతీయ జనతా పార్టీ 10 ప్రాంతాల్లో ముందంజలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి, ఒక పార్టీ లేదా కూటమి శాసనసభలో మెజారిటీ ఓట్లను పొందాలి. ఒక రాష్ట్ర శాసనసభలోని మొత్తం స్థానాల సంఖ్య ప్రతి రాష్ట్ర అసెంబ్లీలో మెజారిటీ ఓట్లను నిర్ణయిస్తుంది. ప్రతి రాష్ట్రంలో, మెజారిటీ మార్క్ మొత్తం అసెంబ్లీ సీట్లలో సగంతోపాటు అదనపు సీటును కలిగి ఉంటుంది. తెలంగాణ అసెంబ్లీలో 119 స్థానాలు ఉండగా మెజారిటీ మార్కు 60.
2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కే చంద్రశేఖర్ రావు(chandra shekar rao) నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అసెంబ్లీలో 88 సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ కేవలం 19 స్థానాలకే పరిమితమైంది. 2014 నుంచి 2018 వరకు రాష్ట్రాన్ని పాలించిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ వరుసగా రెండవసారి అధికారంలోకి రాగా కేసీఆర్ సీఎం అయ్యారు. 2014 తెలంగాణ ఎన్నికల్లో TRS 63 స్థానాలతో మెజారిటీ సాధించగా, కాంగ్రెస్ కేవలం 21 స్థానాలను మాత్రమే పొందగలిగింది.