తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ఎండలు (Summer) మండిపోతున్నాయి. భానుడి భగభగలకు జనాలు విలవిలలాడిపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు( Temperatures ) నమోదయ్యే అవకాశం ఉందని వాతావారణ శాఖ( Weather Dept ) హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో సాధారణం కంటే రెండు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పలు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నగరంలోని బోరబండలో నిన్న ఏకంగా 40.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ఎండలు (Summer) మండిపోతున్నాయి. భానుడి భగభగలకు జనాలు విలవిలలాడిపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు( Temperatures ) నమోదయ్యే అవకాశం ఉందని వాతావారణ శాఖ( Weather Dept ) హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో సాధారణం కంటే రెండు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పలు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నగరంలోని బోరబండలో నిన్న ఏకంగా 40.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఖైరతాబాద్‌లో 40.1, శేరిలింగంపల్లిలో 39.9, షేక్‌పేటలో 38.9, మియాపూర్‌లో 38.7, సరూర్‌నగర్‌లో 38.1, కాప్రాలో 38 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగానే నమోదవుతున్నాయి. నిన్న 25 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణ (Telangana) రాష్ట్ర అభివృద్ధి, ప్రణాళిక సొసైటీ తెలిపింది. కాగా, నగరంలో నేడు పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, సాయంత్రం, రాత్రి వేళలో తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని వాతావరణకేంద్రం(weather station) వెల్లడించింది. ఎండలు ఒక్కసారిగా పెరగడంతో విద్యుత్ వినియోగం కూడా పెరిగింది. ఈ నెల 3న గరిష్ఠంగా 69.10 మిలియన్ యూనిట్ల వినియోగం నమోదైంది.