SRCL: దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన రాజన్న ఆలయానికి సీఎం రేవంత్ రెడ్డి నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేపట్టారని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మటి నరసయ్య పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేటలో సోమవారం ఆయన చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. బీజేపీ అర్థంలేని నిరసనలను తెలుపుతుందని విమర్శించారు. ఆలయ అభివృద్ధిపై భక్తులను తప్పు దోవ పట్టిస్తున్నారని తెలిపారు.