MDK: జిల్లాలో జరుగుతున్న ZPTC, MPTC ఎన్నికల నామినేషన్ల సందర్భంలో అభ్యర్థులు, రాజకీయ పార్టీలు తప్పనిసరిగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని పాటించాలని జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ గురువారం సూచించారు. అనుమతి పొందిన వాహనాలను మాత్రమే వినియోగించాలి అని అన్నారు. ఊరేగింపులు నిర్వహించాలంటే ముందుగా పోలీస్ అనుమతి తప్పనిసరన్నారు.