RR: ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రాయన్ గూడలో మహిళా డ్వాక్రా భవనం, మేకగూడ నుంచి జేపీ దర్గా రోడ్డు వరకు బీటీ రోడ్డు నిర్మాణం పనులకు భూమి పూజ చేసినట్లు తెలిపారు. అనంతరం రంగాపూర్‌లో అంగన్వాడీ కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపనలు చేశామన్నారు.