MNCL: జన్నారంలో ఏర్పడిన ఇసుక సమస్యపై జీవో జారీలో జాప్యం కావడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. జన్నారం కవ్వాల్ అభయారణ్యం పరిధిలో ఉండడంతో తొమ్మిది కిలోమీటర్ల మేర ఇసుక సేకరణను ప్రభుత్వం నిలిపివేసింది. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఒక కిలోమీటర్ కుదించాలని అటవీ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు జీవో జారీ కాలేదు.