KNR: కొత్తపల్లి మండలం ఎలగందల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు దాతల సహకారంతో బ్యాగులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను, సహాయ సహకారాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో రాణించి సొంత కాళ్లపై నిలబడాలని సూచించారు.