BDK: దుమ్ముగూడెం మండలంలోని నడిగూడెం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఇంటి నిర్మాణం కోసం తీసిన పునాది గోతిలో ప్రమాదవశాత్తు పడి 18 నెలల అక్షయ్ కుమార్ అనే బాలుడు మృతి చెందాడు. బాలుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు వెతకగా, గుంతలో ఉన్న బాలుడిని గుర్తించి పీహెచ్సీకి తరలించారు. అయితే, అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.