MBNR: దేశ మాజీ ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా అడ్డాకల్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఉదయం 6 గంటలకు ‘ఐక్యత కోసం పరుగు (Run For Unity)’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. సుమారు 2 కిలోమీటర్ల దూరం వరకు పరుగు ఏర్పాటు చేయబడిందని, యువతీ, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని దేశ ఐక్యతకు తమ మద్దతు తెలపాలని ఆయన కోరారు.