BDK: యువత డ్రగ్స్ బారిన పడకుండా తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని డీఎస్పీ చంద్రభాను తెలిపారు. ఇల్లందు పట్టణంలోని జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ‘డ్రగ్స్ పై యుద్ధం’ అనే కార్యక్రమంలో డీఎస్పీ పాల్గొని మాట్లాడారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి, చదువుపై దృష్టి పెట్టాలని, మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై విద్యార్థులకు డీఎస్పీ అవగాహన కల్పించారు.