VKB: పెద్దేముల్ పరిధిలోని గొట్లపల్లి ఆదర్శ పాఠశాలలో మిగిలిన సీట్లకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ గాయత్రీ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, ఇంటర్ మొదటి సంవత్సరంలో MPC, BIPC, CEC, MEC సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు కళాశాలను సంప్రదించాలని సూచించారు.