PDPL: కలెక్టరేట్ పక్కన ఉన్న పారాబాయిల్డ్ రైస్ మిల్లుల నుంచి వెలువడుతున్న వ్యర్థాల వలన దుర్వాసన వ్యాపిస్తోంది. దీంతో శ్వాసకోశ సమస్యలు, ఇతర అనారోగ్య సమస్యలు వస్తున్నాయని బృందావన్ కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. దుర్వాసనతో కూడిన వ్యర్థాలు పెద్దపల్లి- కరీంనగర్ రహదారిపై చేరడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని వాపోతున్నారు.