MDK: గాంధీభవన్ ముట్టడికి తరలి వెళ్లుతున్న మండల ముదిరాజ్ సంఘం నాయకులను పెద్ద శంకరంపేట పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కామారెడ్డి డిక్లరేషన్‌లో సీఎం రేవంత్ రెడ్డి ముదిరాజ్‌లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ముదిరాజ్‌లను BC-D నుంచి BC-Aలో చేర్చాలని, కోకాపేటలో 5 ఎకరాలలో ముదిరాజ్ భవన్‌ను నిర్మించాలని డిమాండ్ చేశారు.