KNR: గ్రామీణ ప్రజలకు వైద్యాన్ని అందుబాటులో ఉంచాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. శుక్రవారం తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామంలో నిర్మించిన పల్లె దవాఖానను ఆయన ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు వైద్యాన్ని అందుబాటులో తేవాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం పాటుపడుతుందన్నారు.