JGL: జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో బుధవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్లబ్ సభ్యుడు డాక్టర్ గడ్డం రమేష్ రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా మెట్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల కోసం 1000 లీటర్ల వాటర్ ట్యాంకును విరాళంగా అందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు వెల్ముల శ్రీనివాసరావు, సభ్యులు పాల్గొన్నారు.