జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఖరీఫ్ వానకాలం వరి పంట ధాన్యం కొనుగోలుకు జిల్లాలో 421 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సుమారు 7.5 నుండి 8 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. సహకార సంఘాలు, ఐకెపి, మెప్మా ఆధ్వర్యంలో కేంద్రాలు పనిచేస్తాయని, రైతుల వివరాలను ముందుగానే పిఓఎంఎస్లో నమోదు చేయాలని సూచించారు.