KMR: తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణంలో మంగళవారం ఉదయం 11గం.లకు ఫార్మా కంపెనీ ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డా.సుధాకర్ గౌడ్ తెలిపారు. ఎమ్మెస్సీ కెమిస్ట్రీ పూర్తి చేసిన 2022, 23, 24, 25 సంవత్సరం విద్యార్థులు అర్హులన్నారు. విద్యార్థులు సంబంధిత ధ్రువపత్రాలు తీసుకొని డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీలో హాజరు కావాలన్నారు.