WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని రంగాపురం గ్రామంలో ప్రజా పాలన- ప్రగతి ప్రాణాలిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం గ్రామ ప్రజలకు బెత్త బుట్టల పంపిణీ చేశారు. ఈ మేరకు గ్రామ సర్పంచ్ ఓరుగంటు మాధురి రాజు ప్లాస్టిక్ వ్యర్ధ పదార్థాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిందేందుకు కృషి చేయాలని గ్రామ ప్రజలను కోరారు.