HYD: తనమీద పోలీసులు నమోదుచేసిన కేసుల వివరాలను గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బయటపెట్టారు. అక్రమకేసులను నమోదు చేయడానికి గలకారణం ఏంటో చెప్పాలని రాష్ట్ర డీజీపీకి లేఖరాశారు. మధ్యప్రదేశ్లో జరిగిన హిందూ సభలో తానుమాట్లాడిన మాటలను పోలీసులు వక్రీకరించి కేసు నమోదు చేసారని ఫిర్యాదు చేశారు. హైరాదాబాద్ సిటీకి సంబంధం లేకుండా కేసు ఎలా పెడతారని లేఖలో ప్రశ్నించారు.