BDK: భద్రాచలం సబ్ స్టేషన్ పరిధిలో ఇవాళ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుందని అధికారులు తెలిపారు. విద్యుత్ మరమ్మతుల దృష్ట్యా ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ఇండస్ట్రియల్ ఏరియా, కేసీఆర్ కాలనీ, చర్ల రోడ్డు, రాజరాజేశ్వరి ఆర్చ్, బ్రిడ్జి రోడ్డు, అంబేద్కర్ సెంటర్, అశోక్ నగర్, భూపతిరావు కాలనీ తదితర ప్రాంతాల్లో కరెంటు నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.