ADB: నార్నూర్ సీఐ పీ.ప్రభాకర్ శనివారం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ చేతుల మీదుగా ఉత్తమ అవార్డు అందుకున్నారు. ప్రజల సమస్యల పరిష్కారంతో పాటు యువతను చెడు అలవాట్లతో దూరంగా ఉంచేలా కృషి చేస్తున్న ప్రభాకర్ సేవలను అభినందిస్తున్నామని ఎస్పీ పేర్కొన్నారు. యువతకు క్రీడా, శాంతి భద్రతలకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ కాజల్ సింగ్ ఉన్నారు.