KMR: ఎల్లారెడ్డి MLA మదన్ మోహన్ రావు శుక్రవారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల నియోజకవర్గంలో జరిగిన నష్టం వివరాలను, చేపట్టిన అభివృద్ధి పనులను ఆయనకు వివరించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు.