ADB: గాదిగూడ మండలంలోని హీరాపూర్ గ్రామానికి చెందిన ఆదివాసీ మెస్రం వంశ పెద్ద మోతిరాం పటేల్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆదివాసీల సంప్రదాయాలను కాపాడుతూ సమాజాభివృద్ధికి ఎంతో కృషి చేశారు. మోతిరాం మరణం తీరని లోటు అంటూ ఆదిలాబాద్ జిల్లాలో విషాద ఛాయలు నెలకొన్నాయి.