WGL: జిల్లా కేంద్రానికి చెందిన చెందిన నేషనల్ అవార్డు గ్రహీత, మెజీషియన్ శ్రీరామ్ కల్యాణ్ ప్రతిష్టాత్మక ‘మేజిక్ స్టార్’ అవార్డు అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ మెజీషియన్స్ అసోసియేషన్ (APMA) ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఇటీవల 41వ మేజిక్ ఫెస్టివల్ ఘనంగా జరిగింది. ఈ ఫెస్టివల్లో తాను అవార్డుతో పాటు నగదు బహుమతి అందుకున్నట్లు బుధవారం తెలిపారు.