»At The National Level Telangana Village Light Won 13 Awards
Vigyan Bhavan : జాతీయ స్థాయిలో తెలంగాణ పల్లె వెలుగులు..13 అవార్డులు కైవసం
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో మంచి పనితీరు కనబర్చిన గ్రామ పంచాయతీలకు ‘దీన్‌దయాల్ ఉపాధ్యాయ (Deendayal Upadhyay) పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్-2023’, ‘నానాజీ దేశ్‌ముఖ్(Nanaji Deshmukh) సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్-2023’ పేరుతో పురస్కారాలను అందజేసింది. ఇవాళ ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్(Vigyan Bhavan) లో ఈ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది.
తెలంగాణ (Telangana) పంచాయితీలు పచ్చదనం పరిశుభ్రతతో పాటు అభివృద్ధి లో దేశంలోనే అత్యున్నత స్థాయిలో నిలిచాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మొత్తం 46 ఉత్తమ అవార్డుల్లో 13 అవార్డులను తెలంగాణ కైవసం చేసుకుంది. ఢిల్లీలోని విజ్ఞాన భవన్(Vigyan Bhavan)లో సోమవారం జరిగిన ‘పంచాయతీల ప్రోత్సాహకంపై జాతీయ సదస్సు – అవార్డుల ప్రదానోత్సవం’ కార్యక్రమంలో జాతీయ ఉత్తమ అవార్డులను, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) చేతుల మీదుగా అందుకున్నారు.ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli Dayakar)ను, కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ హనుమంతరావు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, పంచాయతీరాజ్ శాఖ అధికారులను సీఎం అభినందించారు.
దీన్‌దయాల్ ఉపాధ్యాయ్ (Deendayal Upadhyay) పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాల్లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు 27 అవార్డులు ప్రకటిస్తే.. అందులో ఏకంగా 8 అవార్డులు రాష్ట్రానికి దక్కడం విశేషం. మొత్తం 9 కేటగిరీలు ఉండగా అందులో 4 విభాగాల్లో రాష్ట్రానికే మొదటి స్థానం దక్కింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గౌతంపూర్ (Gautampur ) ,జనగాం జిల్లా నెల్లుట్ల, మహబూబ్‌నగర్ జిల్లా కొంగట్పల్లి.. సూర్యాపేట జిల్లా ఐపూర్, జోగులాంబ గద్వాల జిల్లా మాన్‌దొడ్డి, వికారాబాద్ జిల్లా చీమల్దర్రి పంచాయతీలు అవార్డులు దక్కించుకున్నాయి.అలాగే పెద్దపల్లి జిల్లా సుల్తాన్పూర్(Sultanpur), రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట, కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ అవార్డులకు ఎంపికయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా ముఖ్రా-కే, రంగారెడ్డి జిల్లా కన్హాతో పాటు మరికొన్ని గ్రామాలు అవార్డులను దక్కించుకున్నాయి. ఈ మేరకు రాష్ట్రపతి చేతుల మీదుగా సర్పంచ్‌లు, కలెక్టర్లు అవార్డులు అందుకున్నారు. మంత్రి ఎర్రబెల్లితో కలిసి వీరంతా అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్నారు.