NLG: గత రెండేళ్లుగా ఆగిపోయిన మంగాపురం గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులను సర్పంచ్ చక్కని ఉపేంద్రమ్మ సత్యం ఆదివారం పునఃప్రారంభించారు. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి పనులను ప్రారంభించిన ఆమె, గ్రామాభివృద్ధే తన లక్ష్యమని, త్వరలోనే భవనాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.