RR: షాద్ నగర్ నియోజకవర్గం ఎల్లంపల్లి గ్రామానికి చెందిన రాజశేఖర్‌ను హత్య చేయడాన్ని నిరసిస్తూ MRPS కొందుర్గు మండల కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ కొందుర్గు మండల అధ్యక్షులు ఆనంద్ మాట్లాడుతూ.. హత్యపై ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి నిష్పక్షపాతంగా విచారణ చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు.