PDPL: రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి డీఎస్పీ భూక్యా రామ్ రెడ్డి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏసీపీ కృష్ణ, సీఐలు, ఎస్సైలు ఆయనను డీఎస్పీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలను అందించారు. పోలీసు సిబ్బంది, ప్రజల సహకారంతో సమర్థవంతంగా శాంతి భద్రతలను కాపాడుతామని పేర్కొన్నారు. ఎవరికి ఇబ్బందులు ఉన్నా తనను నేరుగా సంప్రదించవచ్చన్నారు.