CTR: సదుం మండలం గొంగివారిపల్లి రాజీవ్ నగర్లో నూతనంగా నిర్మించిన సీతారామ ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు ఇవాళ ఘనంగా జరిగాయి. ప్రాణ ప్రతిష్ట, మహా కుంభాభిషేక కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్వామి వారి కల్యాణోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. భక్తులకు ఆలయం వద్ద అన్నదానం ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు.