SRD: జిల్లాలోని మహాత్మ జ్యోతిబాఫూలే బీసీ గురుకుల జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఆసక్తిగల విద్యార్థులు మే 12 వరకు దరఖాస్తు చేసుకోవాలని సంగారెడ్డి జిల్లా కోఆర్డినేటర్ రాజేశం తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు వెబ్ సైట్ ద్వారా రూ.200 చెల్లించి దరఖాస్తు చేయాలన్నారు. గురుకులాల్లో చదివిన విద్యార్థులు నేరుగా ప్రిన్సిపల్ వద్ద దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.