తెలంగాణ ప్రభుత్వం పై ప్రముఖ నటి డింపుల్ హయాతి (Dimple Hayati) ఫైర్ అయ్యారు.డియర్ సర్కారు మాకు పెట్రోల్ ఉచితంగా రావడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ మేరకు.. ‘‘నా ఉద్దేశ్యం ఏమిటంటే ఇది మీ ఇంటికి చేరుకోవడానికి ఒక గంట కంటే ఎక్కువ సమయం పడుతుంది. ట్రాఫిక్ డీసీపీఎస్ (DCPS) ఎక్కడ ఉంది? మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే ఏమి చేయాలి? ఆమె ప్రశ్నించింది. గత రెండు రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉన్నాయి.దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక హైదరాబాద్ నగరం (Hyderabad city) గురించి చెప్పాల్సిన పనిలేదు. చిన్న వర్షాలకే డ్రైనేజ్ వాటర్(Drainage water)తో రోడ్లు నిండిపోయే పరిస్థితి ఉంటుంది.
అలాంటిది రెండు రోజుల నుంచి పడుతున్న ఈ వర్షాలకు హైదరాబాద్ ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. దీంతో రోడ్లపై నీళ్లు నిండిపోయి ఎక్కడికక్కడ రహదారుల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం(disruption to traffic) ఏర్పడుతోంది.అందులో ప్రధానంగా జూబ్లీహిల్స్(Jubilee Hills), బంజారాహిల్స్, దుర్గం చెరువు, గచ్చిబౌలి ఏరియాల్లో ట్రాఫిక్ జామ్‌లు ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలోనే సినీ నటి డింపుల్ హయాతి నిన్న రాత్రి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ దగ్గర ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. దీంతో విసిగిపోయిన బ్యూటీ.. తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని, మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేసింది.డింపుల్ హయాతి ట్వీట్‌పై నెటిజనులు రకరకాలుగా స్పందిస్తున్నారు. వర్షం పడితే ప్రభుత్వం ఏం చేయాలి..అసలు వర్షం పడే టైం లో మీరు ఎందుకు బయటకు వచ్చారు అని కొంతమంది అంటుంటే..మరికొంతమంది మాత్రం డింపుల్ కు సపోర్ట్ గా మాట్లాడుతున్నారు.