BHPL: భూపాలపల్లి, గణపురం, రేగొండ, గోరికొత్తపల్లి మండలాల్లోని అర్హులైన లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ.. పేద ప్రజల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు.