GDWL: రాజోలి మండలం పచ్చర్ల గ్రామంలో పశు వైద్యాధికారిణి డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో 68 పశువులకు గాలికుంటు టీకాలు వేశారు. గిట్టలు చెడిపోవడం, నోటి పుండ్లు, నీరసం వంటి లక్షణాల నివారణకు ఈ టీకాలు ఉపయోగపడతాయని ఆమె తెలిపారు. కార్యక్రమంలో వెటర్నరీ అసిస్టెంట్ పాలాగు, గోపాలమిత్ర భాస్కర్, స్థానిక రైతులు పాల్గొన్నారు.